Saturday, April 17, 2010

thought...

నువ్వే నా హార్డ్ కాపి...
నువ్వే నా సాఫ్ట్ కాపి...
mirror లో చూస్తే నేను నువ్వు గా కనిపించే xerox కాపి....

ఎవరు ఎవరు?

Sunday, April 4, 2010

suvarnamma....nekosamee

This post is kind of special to me...
Written this poem for my aunt ...all her children n grand children names in it...


పేరు లోనే ఉంది సువర్ణం

అవసరమా నీకు ప్రత్యేకమైన అభివర్ణం

రామచంద్రుని ఆలిగా
పెంచావు మము ఏంతో లాలిగా

వేణుమాధవుడు మీటే రాగ సుధగా
సంధ్యవేళ శిల్పి చెక్కిన అందమైన రాధగా

శివుడి కోసం అభిషేకం చేసే వైభవ బిందువుగా
కవితలలో వేద పండితులు కొలిచే త్రిపుర సుందరిగా

నిశీధిలో తేజో అభిలాషగా
నిలిచావు నీవు అనునిత్యం నా నీడగా!

నా ప్రతి బాట లొ చేయూతవై
నా ప్రతి కదలికలొ చైతన్యమై
నిలిచావు ప్రతి సారి నా తోడువై
కృతజ్ఞత తెలుపన నీ పాదముల చెంత పద్మమునై...